News March 6, 2025
రుద్రంగికి పోలీస్‌స్టేషన్ మంజూరు

రుద్రంగి పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.50కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌ను కోరగా.. ఆయన స్పందించి నిధులు విడుదల చేయించారు.
Similar News
News November 3, 2025
SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.
News November 3, 2025
ములుగు: నెదర్లాండ్స్ పర్యటనకు మంత్రి సీతక్క..!

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించే నిమిత్తం ఆమె నెదర్లాండ్స్‌కు వెళ్లారు. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో, పార్టీ వర్గాలు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపి, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
News November 3, 2025
ఆసిఫాబాద్: 7 మద్యం షాపులకు.. రేపే లక్కీ డ్రా

ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు అక్టోబర్ 27న 25 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు రేపు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.


