News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017723>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 29, 2025
అమెరికాలో యాక్సిడెంట్.. మహబూబాబాద్ యువతులు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్తతో విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 29, 2025
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం (రేపు) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మార్కెట్‌లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 31వ తేదీ (బుధవారం) నుంచి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లాలోని రైతు సోదరులు, వ్యాపారులు సహకరించాలని అధికారులు కోరారు.
News December 29, 2025
సిరిసిల్ల: ‘గెలిచినా.. ఓడినా లెక్క చెప్పాల్సిందే’

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా 45 రోజుల్లో ఎంపీడీవోలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాగా, చాలామంది అభ్యర్థులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గడువు దాటితే అభ్యర్థులపై వేటు పడే అవకాశం లేకపోలేదు.


