News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.
Similar News
News April 9, 2025
బ్రంకోస్కోపి టెస్ట్ ఏంటి? ఎలా చేస్తారు?

ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కెమెరాతో కూడిన పరికరాన్ని ముక్కు/నోటి ద్వారా పంపుతారు. కణితులు, శ్వాసనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, బ్లాక్స్, ఇన్ఫెక్షన్ వంటివి నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి 30-45 నిమిషాలు పడుతుంది. సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ AP Dy.CM కుమారుడు మార్క్ శంకర్‌కు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో నిన్న ఈ <<16034506>>టెస్ట్ <<>>చేశారు.
News April 9, 2025
HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
News April 9, 2025
పిట్లం: Way2News ఎఫెక్ట్..’వన్యప్రాణుల దప్పిక తీరింది’

ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిట్లం అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా అడవిలోని మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 7న <<16018843>>’వన్య ప్రాణుల గొంతెండుతోంది’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం సాసర్ పిట్లలలో నీటి ట్యాంకర్ సహాయంతో నీటిని నింపారు.