News November 27, 2025
రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
Similar News
News December 3, 2025
HYD: వీలైతే లైవ్.. లేకుంటే SMలో LIVE

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. దీంతో పట్టణంలో నివసిస్తున్న ప్రజలు, సర్పంచ్, వార్డు మెంబర్ క్యాండిడేట్ల స్నేహితులు, బంధువులు ప్రచారంలో పాల్గొనడానికి బయలు దేరుతున్నారు. ఇప్పటికే కొందరు HYDలో ఉండి సైతం ఫలానా అభ్యర్థిని గెలిపించాలని SMలో లైవ్ వీడియో, నార్మల్ కాల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. OU నుంచి పలువురు విద్యార్థులు సర్పంచ్, వార్డు మెంబర్లుగా నిలబడ్డారు.
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్‌మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
అన్నమయ్య జిల్లా రైతులకు గమనిక

అన్నమయ్య జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు JC ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం రాయచోటి, నిమ్మనపల్లె, రామాపురం,వీరబల్లి, గాలివీడు తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ వరి క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ వరి క్వింటాకు రూ.2,389 చెల్లిస్తామన్నారు.


