News March 26, 2025
రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News March 26, 2025
ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్‌తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
News March 26, 2025
బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.
News March 26, 2025
వికారాబాద్: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: అ.కలెక్టర్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్దతు ధర వరి ఏ-రకం ధాన్యానికి రూ.2320, సన్నాలకు రూ.500 బోనస్, మామూలు రకానికి రూ.2300 మద్దతు ధర నిర్ధారించడం జరిగిందన్నారు.