News March 5, 2025

రుద్రూర్: చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

image

రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు(45) అనే వ్యక్తి మంగళవారం స్థానికంగా ఉన్న గుండ్లవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న బుధవారం తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News March 6, 2025

NZB: తండ్రి మృతితో ఆగిన కూతురి పెళ్లి

image

రుద్రూర్ మండలం బొప్పాపూర్‌కు చందిన సాయిలు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. సాయిలుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న కూతురిని పోతంగల్ మండలం హంగర్గేకర్ చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పది రోజుల్లో వివాహం జరగనుండగా తండ్రి మృతితో కూతురి వివాహం ఆగిపోయింది. పెద్ద కుమర్తె భర్త చనిపోవడంతో ఆమె సైతం తండ్రి ఇంటి వద్దనే ఉంటుంది.

News March 6, 2025

భీమ్‌గల్: వివాహిత ఆత్మహత్య

image

భీమ్‌గల్ మండలంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. SI మహేశ్ ప్రకారం.. లింబాద్రీ గుట్ట కాలనీకి చెందిన సంతోష్‌తో సుమలతకు 2016లో వివాహం జరిగింది. అత్తవారింట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో వేధింపులు తాళలేక ఈ నెల 3న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 4న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

News March 6, 2025

NZB: మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి: అదనపు కలెక్టర్

image

సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసి కట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై  చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

error: Content is protected !!