News April 2, 2025
రుద్రూర్: యువకుడి అదృశ్యం

రుద్రూర్కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 5, 2025
NZB: సామిల్లో భారీ అగ్నిప్రమాదం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ సామిల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.
News April 5, 2025
NZB: కత్తి దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. నగరంలోని ఆరో టౌన్ పరిధిలో అక్బర్ కాలనీ కెనాల్ కట్టలో ఇటీవల కత్తి పోట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు.
News April 5, 2025
NZB: ప్రకృతి విధ్వంసంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆవేదన

గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసంపై బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని, చెట్లను నరికేసే ప్రకృతితో యుద్ధం చేస్తూ పర్యావరణ హననానికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని, ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను నరికేసిన పరిపాలన సాగుతున్నదన్నారు.