News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Similar News
News December 14, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఓటేశారంటే @11AM

పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 62,187 మంది ఓటు వేయగా 55.20 శాతం పోలింగ్ నమోదైంది. అంతర్గం మండలంలో 10,536 ఓట్లు 58.76 శాతం, ధర్మారం మండలంలో 21,927ఓట్లు 51.66 శాతం, జూలపల్లి మండలంలో 14206 ఓట్లు 58.79 శాతం, పాలకుర్తి మండలంలో 15,518 ఓట్లు 55.19శాతం పోలింగ్ నమోదు అయింది.
News December 14, 2025
HYD: అరుదైన దృశ్యం.. ఇంటిపై ఇలవేల్పు!

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కులవృత్తి గౌరవాన్ని చాటిచెప్పే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎలిజాల మహేశ్ గౌడ్ తన ఇంటి ఎలివేషన్‌పై తాటి చెట్టెక్కుతున్నట్లు.. కల్లు పోస్తున్నట్లు సంప్రదాయ దృశ్యాలతో కళాత్మకంగా అలంకరించారు. వృత్తి సంస్కృతిని తరతరాలకు గుర్తు చేసేలా రూపొందిన ఈ అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. కులవృత్తి పట్ల గుర్తింపును చాటే ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
News December 14, 2025
సంగారెడ్డి జిల్లాలో 11@AM 59.57 శాతం పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 2,99,578 ఓట్లకు గాను 1,79,364 ఓట్లు పోలయ్యాయి. 59.57 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంట పోలింగ్ సాగుతుందన్నారు.


