News February 18, 2025

రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

Similar News

News December 12, 2025

తిరుపతి జనసేనలో అంతర్గత లుకలుకలు.!

image

తిరుపతి జనసేనలో అంతర్గత కుమ్ములాటలు బయట పడినట్లు తెలుస్తోంది. కొందరు YCP నేతలకు సహకరిస్తున్నారట. DCM పవన్ మార్ఫింగ్ ఫొటోపై కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారట. పార్టీలో లేని వ్యక్తి పెత్తనం ఏంటి అని చర్చించుకుంటున్నారట. అందుకే కేసు నమోదుకే పోలీసులు పరిమితమయ్యారని వారు విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

News December 12, 2025

వర్ధన్నపేట: 550 ఓట్లకు డబ్బులు పంచితే.. 55 ఓట్లు పడ్డాయి..!

image

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురంలో సర్పంచ్ కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఇక్కడ 8 మంది పోటీ చేయగా, ఓ స్వతంత్ర అభ్యర్థి 550 మందికి ఒక్కో ఓటుకు రూ.వెయ్యి చొప్పున రూ.5 లక్షలకు పైగా పంచినా తీరా ఫలితాల్లో అతడికి 55 ఓట్లే రావడంతో షాక్ అయ్యాడు.తనకు ఓటేయలేదని ఉదయం నుంచే గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వసూలు చేస్తున్న వార్త గ్రామంలో హాస్యంగా మారింది.

News December 12, 2025

పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం

image

TG: పుట్టగొడుగుల పెంపకంతో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చు. అందుకే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం.. పుట్టగొడుగుల పెంపకంపై తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రెడ్‌హిల్స్, నాంపల్లిలో 13.12.2025న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు B.Manga HO 8977714411, Shujauddin 8688848714ను సంప్రదించగలరు.