News July 10, 2025

రుయ్యాడి పీర్ల బంగ్లా ఆదాయం ఎంతంటే..?

image

తలమడుగు మండలం రుయ్యాడి హస్సేన్, హుస్సేన్ దేవస్థానంలో సవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ లెక్కింపును బుధవారం చేపట్టారు. దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగింది. నగదు రూపంలో రూ.14 లక్షలు,10 తులాల బంగారం, 1.25 కేజీల వెండి వచ్చినట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.

Similar News

News July 10, 2025

ADB: నకిలీ పత్రాలతో భూ మాఫియా.. ముఠా అరెస్టు

image

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ల అమ్మకం పేరుతో రూ.23 లక్షలు మోసం చేసిన ఘటనలో ఆరుగురిపై ADB రూరల్ PSలో కేసు నమోదైంది. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్‌రెడ్డి తెలిపారు. గుగులోత్ బాపురావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు), అతడి భార్య అంబికా, దాసరి జ్యోతి, గొడ్డెంల శ్రీనివాస్, పాలెపు శ్రీనివాస్, మాల్లేపల్లి భూమన్నతో కలిసి, నకిలీ పత్రాలు సృష్టించి భూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

News July 10, 2025

ADB: నేడే సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2023 జూన్ 16న పరీక్ష రాసిన మహిళా అభ్యర్థుల 1:3 నిష్పత్తి మెరిట్ జాబితాను https://deoadbd.weebly.com వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం డీఈఓ కార్యాలయంలో మధ్యాహ్న 3 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News July 9, 2025

ADBలో పర్యటించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి బాయి బుధవారం ADB జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను, సఖీ కేంద్రం, బాలరక్షక్ భవన్, శిశుగృహను ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సఖి కేంద్రంలో మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ఉన్నారు.