News December 9, 2024
రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి

TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.
Similar News
News February 15, 2026
మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.
News February 15, 2026
తీవ్ర నిరాశకు గురి చేసిన అభిషేక్

T20WC: హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారనుకున్న ఓపెనర్ అభిషేక్ ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఖాతా తెరవకుండా ఔటవడంపై టీమ్ఇండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. పవర్ ప్లే వరకు ఆడినా పెద్ద స్కోర్ వస్తుందని ఆశించగా తొలి ఓవర్లోనే చెత్త షాట్ ఆడి పెవిలియన్‌కు చేరారు. మీరేమంటారు?
News February 15, 2026
అల్లు శిరీష్ పెళ్లి.. చిరంజీవికి తొలి శుభలేఖ

యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి సందడి మొదలైంది. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు. వారి వద్ద ఆశీర్వాదం తీసుకొని నూతన వస్త్రాలు అందజేసి పెళ్లికి ఆహ్వానించారు. ప్రియురాలు నయనికను శిరీష్ మార్చి 6వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది OCTలో వీరి ఎంగేజ్‌మెంట్ అయింది. అటు చిరంజీవి చేతికి కట్టు కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


