News December 18, 2025
రూపాయికే ఇంటర్నెట్ ప్యాక్: ‘డబ్బా’ నెట్‌వర్క్

‘PM వాణి’ అమలులో భాగంగా రూపాయి నుంచి ఇంటర్నెట్ ప్యాక్‌లు అందిస్తున్నట్లు బెంగళూరు సంస్థ ‘డబ్బా’ నెట్‌వర్క్ తెలిపింది. తమ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. PM వాణి పథకం ద్వారా ఎవరైనా తమ ఏరియాలో వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ పంపిణీదారుగా మారొచ్చు. డేటా ప్యాక్‌ల ద్వారా వైఫై అందిస్తారు. డబ్బా నెట్‌వర్క్ ఏడాదిలో 73,128 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటుచేసింది.
Similar News
News December 22, 2025
అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.
News December 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు: మంత్రి సత్యకుమార్

APలోనే తొలిసారి 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులు, ఒంగోలులోని MCH, పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రులకు అందించినట్లు చెప్పారు. ‘JAN 1 నుంచి ఉచిత సేవలు మొదలవుతాయి. ఈ స్కాన్‌తో 18-22 వారాల గర్భస్థ శిశువు లోపాలను కనుగొనవచ్చు. గర్భిణులకు ₹4K చొప్పున ఆదా అవుతుంది’ అని తెలిపారు.
News December 22, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన కృష్ణప్ప గౌతమ్

IPL క్రికెటర్, కర్ణాటక ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. IPLలో MI, RR, PBKS, LSG, CSK జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ 37 ఏళ్ల ఆల్‌రౌండర్ 36 మ్యాచుల్లో 247రన్స్, 21వికెట్స్ సాధించారు. 59 ఫస్ట్ క్లాస్, 68 లిస్ట్-A మ్యాచుల్లో కలిపి 320వికెట్లు తీశారు. రంజీలో(2016-17) 8 మ్యాచుల్లో 27W, 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్-2019లో 56 బంతుల్లో 134 రన్స్ చేయడం ఆయన కెరీర్‌కే హైలైట్.


