News March 1, 2025
రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.
Similar News
News March 1, 2025
VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
News March 1, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి 2 ఏళ్లు జైలు: పార్వతీపురం SP

హత్యాయత్నం కేసులో నిందితునికి రేండుళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి తెలిపారు. 2022 మే 19 న పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో జరిగిన గొడవలో బి.రాము తన భార్యపై అనుమానంతో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గొడవపడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతోపాటు రూ. 500 జరిమానా కోర్టు విధించింది.
News March 1, 2025
రేపటి నుంచి దబిడి దిబిడే..

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.