News August 19, 2025

రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

image

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.

Similar News

News August 19, 2025

రైతులకు ఆందోళన అవసరం లేదు: జనగామ డీఏఓ

image

యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) అంబికా సోని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అవసరానికి మించి ఎరువును నిల్వచేసుకోవద్దని సూచిస్తూ, ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని DAO వివరించారు.

News August 19, 2025

విశాఖ-అరకు వస్తున్న ఎక్సప్రెస్‌కు స్త్రీ శక్తి పథకం అమలు కావట్లేదు

image

విశాఖ నుంచి అరకు మీదుగా ఒనకఢిల్లీ వెళ్ళే ఎక్సప్రెస్ కు “అంతరాష్ట్ర సర్వీసు” పేరుతో స్త్రీ శక్తి పథకం అమలు చేయలేదు. విశాఖ నుంచి అరకు వస్తున్న ఒకే ఒక్క ఎక్సప్రెస్ కావడంతో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ మండలాల మహిళలకు స్త్రీ శక్తి పథకం అందని ద్రాక్షగా ఉంది. ఈ బస్సు ప్రయాణించు 200కి.మీలలో 130కి.మీ ఆంధ్ర‌లోనే ఉంది. దీనిపై DPTO మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా పైస్థాయిలో అంతరాష్ట్ర సర్వీసలపై చర్చ జరుగుతుందన్నారు

News August 19, 2025

‘ఈనెల 24న చొప్పదండికి మీనాక్షి మేడమ్’

image

ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొననున్నారని చెప్పాయి. 25వ తేదీ ఉదయం 7 గంటల వరకు శ్రమదానం, పార్టీ నేతల సమావేశం ఉంటుందన్నాయి.