News March 19, 2024
రూ. 100కోట్ల చెల్లింపులో MLC కవిత కీలక పాత్ర: ED
ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ కవిత..ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంతో భాగస్వామి అయ్యారని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత, మరికొందరితో కలిసి ఆప్ అగ్రనేతలతో కుట్రపన్నారని ఈడీ పేర్కొంది. కాగా ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
Similar News
News January 7, 2025
బాన్సువాడ: KTR అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడు: జూపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజు ఉన్నారు.
News January 7, 2025
NZB: కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ రాక
నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మంగళవారం మధ్యాహ్నం డిచ్పల్లిలో నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానునున్నట్లు వివరించారు.
News January 7, 2025
NZB: విద్యార్థిని చితకబాదిన టీచర్
నాగిరెడ్డిపేటకు చెందిన రుత్విక్ గోపాల్ పేట్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన జూలీ అనే టీచర్ రుత్విక్‌ను సోమవారం కర్రతో చితకబాదింది. కాళ్లు, చేతులపై దద్దులు వచ్చే విధంగా కొట్టడంతో విద్యార్థి తండ్రి నర్సింలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీచర్ పరీక్ష పెట్టి కర్రతో కొట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై మల్లారెడ్డి వివరించారు.