News July 10, 2024
రూ.100 కోట్లతో సూర్యాపేట అభివృద్ధి: పటేల్ రమేష్ రెడ్డి
రూ.100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్‌తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి.. సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి
చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి
చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
News November 25, 2024
NLG: డిగ్రీ పరీక్ష వాయిదా
రేపు (మంగళవారం) జరగవలసిన డిగ్రీ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని కోరారు.