News October 15, 2025
రూ.1000 పెరిగిన వండర్ హాట్ మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి మంగళవారం రూ.14,550 ధర పలకగా.. బుధవారం రూ.14,850కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.16,150 ధర పలకగా..ఈరోజు రూ.15,900 కి పడిపోయింది. వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర వస్తే.. నేడు రూ. 1000 పెరిగి రూ.16,500కు చేరుకుంది.
Similar News
News October 15, 2025
డయల్ 100పై వేగంగా స్పందించాలి: KMR SP

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కొత్తగా ఏర్పాటు చేసిన రికార్డు రూమును ప్రారంభించారు. ఆవరణ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించి, గ్రేవ్ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డయల్ 100 కాల్స్‌పై వేగంగా స్పందించాలని, గస్తీ పెంచాలని సీఐ రామన్‌కు సూచించారు.
News October 15, 2025
TU: ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగాధిపతిగా డా.మహ్మద్ అబ్దుల్ ఖవిని నియస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొ.టి.యాదగిరి రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి అందజేశారు. మహ్మద్ అబ్దుల్ ఖవి మైనారిటీ సెల్ డైరెక్టర్, ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఉర్దూ అరబిక్ తదితర పోస్టుల్లో తనదైన ముద్ర వేశారు.
News October 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>