News January 16, 2026
రూ.13 వేల కోట్ల ప్లాంట్.. రేపే శంకుస్థాపన!

కాకినాడ రూరల్‌లో రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే కొండబాబు, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News March 9, 2026
శ్రీలంక కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్

శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్ నియమితులయ్యారు. APR 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్నారు. 2011-13 వరకు సౌతాఫ్రికా కోచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో (2013) సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లలో ఐసీసీ నం.1 ర్యాంక్ సాధించింది. కాగా T20WC-2026లో శ్రీలంక సూపర్-8 దశలో ఓడటంతో కోచ్ జయసూర్య రాజీనామా చేశారు.
News March 9, 2026
ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిన నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక జరిగింది. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 9, 2026
వికారాబాద్ కలెక్టరేట్‌లో కుక్కల బెడద!

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కుక్కల స్వైర విహారం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది. కొంతకాలంగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ విధులకు వచ్చే ఉద్యోగులపై దాడులకు తెగబడుతుండటంతో భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ లోపలికి కూడా కుక్కలు ప్రవేశిస్తుండటంతో ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నామని, కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


