News September 16, 2024
రూ.13.50 లక్షలు పలికిన నల్గొండ పాతబస్తీ లడ్డూ

నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
Similar News
News February 28, 2026
నల్గొండ: పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.
News February 28, 2026
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ ఆదేశం

ఎండాకాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.
News February 28, 2026
నల్గొండలో ఉపాధి నిధుల రాజకీయం

నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 211.36 కోట్ల నిధుల పంపిణీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వాటా కోసం పట్టుబడుతుండటమే దీనికి కారణం. గతంలో మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో, తాజా నిధుల కేటాయింపు అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.


