News April 8, 2025
రూ.143 కోట్లతో మరమ్మతులు: మంత్రి స్వామి

మంత్రి స్వామి డెహ్రాడూన్లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News December 20, 2025
సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.
News December 20, 2025
ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


