News April 1, 2024
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.
Similar News
News April 20, 2025
రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని MBNR కలెక్టర్ ఆగ్రహం

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలం వెన్నచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వేసవిలో కేంద్రాలకు వచ్చే రైతులకు నీడ, తాగునీరైనా కల్పించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
News April 20, 2025
కాంగ్రెస్‌ది చేతకాని పాలనకు నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్

మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పరిశ్రమలు ఏర్పాటుచేసి పెట్టుబడులు రాబట్టాలి గాని మద్యం రేట్లు పెంచి ఆదాయాన్ని అర్జించాలనే ప్రభుత్వ ధోరణి చేతకాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.
News April 20, 2025
MBNR: పీయూలో అధ్యాపకుల నిరసన.!

తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల జేఏసీ పిలుపు మేరకు పాలమూరు యూనివర్సిటీలో ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మెలో భాగంగా మోకాళ్లపై నించొని నిరసన చేశారు. ఈ సందర్భంగా ఒప్పందం అధ్యాపకుల సంఘం నాయకులు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 21 వెంటనే రద్దు చేయాలని, సెట్టు, నెట్టు పీహెచ్డీ అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకుల అందరినీ బేషరతుగా క్రమబద్ధీకరించాలని అన్నారు.