News March 28, 2025
రూ.165 లక్షలతో ఆరోగ్య సేవల మెరుగు..IOCL

ఇండియన్ ఆయిల్ TAPSO HYDలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు 3 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.165 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులతో స్వీకార్ అకాడమీలో ఆటిజం బాధిత పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, కోఠిలో ప్రభుత్వ ENT ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలు, మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
Similar News
News March 31, 2025
KMR: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రంజాన్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.ఎస్పి చైతన్య రెడ్డి. జిల్లా అధికారులు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
News March 31, 2025
NLG: టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.