News October 2, 2025

రూ.200 కొట్టు.. పెన్షన్ నగదు పట్టు.!

image

పలమనేరులో ప్రభుత్వ పథకాల పంపిణీలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వృద్ధులు, మంచాన ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొందరు ఉద్యోగులు లబ్ధిదారుల నుంచి రూ.200 తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఇవ్వని వారిని తిప్పించుకోవడం, ఆలస్యం చేయింయడం వంటివి చేస్తున్నారట. దీనిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరారు. మీ ఏరియాలో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతోంది?

Similar News

News October 2, 2025

చిత్తూరు: ఎనిమిది KGBVల్లో సీసీ కెమెరాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో బాలికల భద్రత నిమిత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 8 కేజీబీవీలకు సీసీ కెమెరాలను మంజూరు చేసిందన్నారు. వీటిల్లో ప్రత్యేక బృందం సీసీ కెమెరాలను అమర్చుతారన్నారు.

News October 2, 2025

ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు

image

చిత్తూరు జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు ఎస్పీ తుషార్ డూడీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ వల్ల కుటుంబ సఖ్యతను గౌరవించడం సాంప్రదాయాలను పాటించడం సమాజంలో ఐక్యతను పెంపొందించడం వంటి విలువలకు గుర్తుకు వస్తాయన్నారు. ఈ పండుగను సురక్షితంగా ఆనందంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News October 2, 2025

నేడు మద్యం, మాంసం విక్రయాలు బంద్

image

గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం చిత్తూరు జిల్లాలో ఎక్కడా మద్యం అమ్మకాలు నిర్వహించొద్దని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బార్లలో కూడా మద్యం అమ్మకాలు నిర్వహించరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.