News November 27, 2025
రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలి: కలెక్టర్

జిల్లాలోని రైస్ మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు పూచీకత్తు చెల్లించాలని బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం
ఆయన కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 74 మిల్లులు ఉండగా, రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలన్నారు. రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ, ప్రతి మిల్లులో తేమ యంత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ ఉందన్నారు.
Similar News
News November 28, 2025
పరకామణి దోషులకు శిక్ష పడాలి: YV సుబ్బారెడ్డి

పరకామణి అక్రమాలపై పక్కాగా విచారణ జరగాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని TTD మాజీ ఛైర్మెన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో CID విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ‘భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడవద్దు. తిరుమల లడ్డూ, పరకామణి ఘటనలను అడ్డం పెట్టుకొని వివాదాలు రేపుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని మేమే చెబుతున్నాం. నన్ను పిలిచినా, భూమనను పిలిచినా విచారణ కోసమే’ అని YV అన్నారు.
News November 28, 2025
మూవీ ముచ్చట్లు

* Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్
News November 28, 2025
రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.


