News August 14, 2025
రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు: కలెక్టర్

జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషణ్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News August 15, 2025
VZM: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పిల్లలకు, ఉద్యోగులకు మిఠాయిలను పంచిపెట్టారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏఓ తాడ్డి గోవింద, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News August 15, 2025
విజయనగరం జిల్లాలో ఎన్ని ఫ్రీ బస్సులో తెలుసా..!

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బస్సులను ప్రారంభిస్తారు. ఎస్.కోట, విజయనగరం డిపోల నుంచి 137 బస్సులను దీనికోసం వినియోగించనున్నారు. ప్రస్తుతానికి రోజుకి సగటున సుమారు 12,900 మంది ప్రయాణిస్తుండగా.. పథకం అమలు తరువాత 21,500 మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News August 15, 2025
ఎస్.కోట: తలపై రాయిపడి బాలుడు మృతి

కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు తలపై రాయిపడి మృతి చెందిన సంఘటన ఎస్.కోటలోని ఆకుల డిపో సమీపంలో చోటు చేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమీన్ ఖాన్ (17) ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓభవనం పక్కన కాలకృత్యాలు కోసం వెళ్లాడు. అదే సమయంలో భవనం పైనుంచి నిర్మాణ కార్మికుడు రాయి కిందికి పడేయడంతో అది అమీన్ తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.