News January 1, 2026

రూ.3వేల కోట్ల విడుదలపై కేంద్రం షరతులు

image

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.

Similar News

News January 2, 2026

విశాఖ రేంజ్ ఐజీతో విజయనగరం ఎస్పీ భేటీ

image

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని ఐజీ గోపినాథ్ జట్టి పేర్కొన్నారు.

News January 2, 2026

2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

image

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.

News January 2, 2026

IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>IIM<<>> బుద్ధగయ 28 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BE/B.Tech, మేనేజ్‌మెంట్ డిప్లొమా, MBA, LLB, PG, CA, M.Phil(హిందీ), PG(సైకాలజీ), డిప్లొమా, B.LiSc, MCA, BBA/BCA, BSc(హార్టికల్చర్), M.Tech, MCom ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iimbg.ac.in