News April 14, 2025

రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: నాగజ్యోతి

image

మంగపేట మండలం మోట్లగూడెంకు చెందిన నర్సింహారావు కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నాగజ్యోతి డిమాండ్ చేశారు. నరసింహరావు మృతదేహాన్ని నాగజ్యోతి పరామర్శించి, మాట్లాడుతూ.. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే రైతు నరసింహారావు మనస్తాపంతో పురుగుమందు తాగి మృతి చెందాడన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 11, 2025

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది: సోమిరెడ్డి

image

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో లీటర్‌కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.

News November 11, 2025

రాజమౌళి సర్‌ప్రైజ్‌లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ

image

మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను రాజమౌళి వరుస సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తుతున్నారు. ఈ నెలలో SSMB29 నుంచి కేవలం టైటిల్ గ్లింప్స్, లుక్ రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా పృథ్వీరాజ్ లుక్, ఓ <<18251735>>సాంగ్‌<<>>ను రిలీజ్ చేశారు. త్వరలో ప్రియాంక లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. అటు ఈ నెల 15న టైటిల్‌తో పాటు 3 నిమిషాల గ్లింప్స్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అప్డేట్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News November 11, 2025

ఖమ్మం: సదరం స్కామ్‌.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌

image

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో గత రెండేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సదరం విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. స్కామ్‌లో పాలుపంచుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.