News May 17, 2024
‘రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం’

ఆస్పత్రిలో మరణించిన బాలుడి మృతదేహం అప్పగించేందుకు ప్రైవేటు ఆస్పత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. అంత ఇవ్వలేని పేద కుటుంబం రూ.7 వేలు ఇచ్చి డెడ్‌బాడీని తీసుకెళ్లింది. కుక్కునూరు మం. కురుమలతోగులో దేవ అనే బాలుడికి వాంతులు, వీరేచనాలు అవుతుండగా భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోగా మృతదేహాన్ని ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 10, 2025
పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్‌ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్‌ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్‌పీ కెనాల్‌లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
News November 8, 2025
ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.


