News January 29, 2025

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహశీల్దార్ జాహ్నవి బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైతుకు పాస్ బుక్ ఇచ్చేందుకు తహశీల్దార్ జాహ్నవి, VROతో కలిసి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం.

Similar News

News February 24, 2026

ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు యువకుల మృతి

image

సిద్దిపేట-కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోబో రెస్టారెంట్ సమీపంలో బైక్ నియంత్రణ తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొమ్మల పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ గుజారి నవీన్ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆసిఫాబాద్: మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు: ఎస్పీ

image

త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, తప్పుడు నంబర్ ప్లేట్లు, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై చర్యలు తప్పవన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయన్నారు.