News November 9, 2025
రూ.318 కోట్లతో ఫుడ్ పార్కులు.. 11న సీఎం శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.
News November 9, 2025
సంగారెడ్డి: రేపు పీఎంశ్రీ సూల్ HMల సమావేశం

జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. క్రీడా పరికాలు, క్రీడా పోటీలపై చర్చ జరుగుతుందని చెప్పారు. పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమయానికి హాజరు కావాలని కోరారు.
News November 9, 2025
కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలులోని నిర్మల్ నగర్‌లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.


