News March 1, 2025

రూ.45లక్షలతో జీజీహెచ్‌లో మౌలిక వసతులు – కలెక్టర్

image

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీజీహెచ్‌లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.

Similar News

News March 1, 2025

కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం.. YCP రియాక్షన్ 

image

కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రజలపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వైసీపీ X వేదికగా స్పందించింది. ‘ఎంత అవివేకం ఎంత కుసంస్కారం నీకు బాలయ్య.?’ అని పోస్ట్ చేసి బాలకృష్ణ గ్రామస్థులతో ఉన్న వీడియోను వైసీపీ జత చేసింది. 

News March 1, 2025

కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 

image

ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

News March 1, 2025

కృష్ణా: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

image

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.

error: Content is protected !!