News February 28, 2026

రూ.5,456.26 కోట్లతో TTD 2026–27 బడ్జెట్

image

TTD 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుమలలో అంశాలను వెల్లడించారు. విద్యాసంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్లు కేటాయించారు. తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్‌రూములు, హాస్టళ్లు, మౌలిక వసతుల మెరుగుదల చేయనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ముడుపు పత్రం పథకం UPI ద్వారా చెల్లింపుల సౌకర్యం ప్రారంభం కానుంది.

Similar News

News March 1, 2026

కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 1, 2026

ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్‌కు IRGC వార్నింగ్

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

News March 1, 2026

అనంతపురంలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

image

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. అనంతపురంలోని కమ్మ భవన్, హైదరాబాద్-బెంగళూరు హైవే, రామ్‌నగర్, రుద్రంపేటలో నేటి ఉదయం 10 AMలకు సదస్సు జరగనుంది. కార్యక్రమంలో JD లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ డోంట్ మిస్.