News February 12, 2026
రూ.55,649 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రోజుకో రీతిలో సాగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు ₹వేలకోట్లు నష్టపోతున్నారు. గత 5 ఏళ్లలో 65,89,063 మంది బాధితులు ₹55,649 CR పోగొట్టుకున్నారు. ఈ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా ₹551 CR మోసపోయారు. అదే 2025లో 24,02,579లు కేసులు నమోదైతే మోసపోయిన సొమ్ము ₹22,495 CRకు చేరింది. కాగా 23.61 లక్షల కేసుల్లో ₹8189 కోట్లు కాపాడగలిగామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
Similar News
News February 12, 2026
ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 12, 2026
లైఫ్‌లో ఎన్నిసార్లు ప్రేమలో పడతారు..?

జీవితంలో ఒక మనిషి సగటున 2సార్లు గాఢంగా ప్రేమిస్తారని కిన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 18-99సం.ల మధ్య గల 10వేల మందిపై సర్వే చేయగా.. 14% అసలు పిచ్చి ప్రేమలో పడబోమని, 28% ఒకసారి, 30% రెండు సార్లు, 17% మూడుసార్లు, 11% 4లేదా అంతకంటే ఎక్కువ సార్లు లవ్‌లో మునిగి తేలుతామన్నారట. ప్రేమ, ఆకర్షణకు తేడా గుర్తించక ప్రతి ఫీలింగ్‌నూ లవ్ అనుకుని ఆ రిలేషన్ మొదట్లో పొరబడతారట. ఈ సర్వేలో మీది ఏ బ్యాచ్? కామెంట్.
News February 12, 2026
మా ప్రాజెక్టుల్ని AP ఎందుకు అడ్డుకుంటోంది: రేవంత్

TG: ‘పాలమూరు-రంగారెడ్డి’ని AP అడ్డుకోవడంపై CM రేవంత్ అసహనం వ్యక్తంచేశారు. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ ఇష్టమొచ్చినట్లు మీరు చేస్తే మాకు నచ్చినట్లు మేమూ చేస్తాం. గోదావరి జలాల్లో మాకూ 960 TMCల వాటా ఉంది. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు నీటిని తరలించాలి. మిగులు జలాల్లో చెరిసగం వాడుకోవచ్చు. చర్చలతో సమస్య తీరుతుంది’ అని CM పేర్కొన్నారు.


