News December 29, 2025

రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.

Similar News

News February 19, 2026

నిద్రలో ఉలిక్కిపడుతున్నారా?.. కారణమిదే!

image

నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడటాన్ని ‘హిప్నిక్ జెర్క్’ అంటారు. ఇది జబ్బు కాదని, మెదడు పంపే సంకేతాల పొరబాటు మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ‘70% మందిలో ఇది కనిపిస్తుంది. అతిగా కాఫీ తాగడం, ఒత్తిడి, నిద్రలేమి దీనికి కారణాలు. గాఢనిద్రలోకి వెళ్లే క్రమంలో కండరాలు రిలాక్స్ అయినప్పుడు మెదడు మనం పడిపోతున్నామని భ్రమపడి ఇలా స్పందిస్తుంది. నిద్ర, వ్యాయామం ద్వారా దీనిని అదుపు చేయవచ్చు’ అని సూచిస్తున్నారు.

News February 19, 2026

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి SIR!

image

దేశవ్యాప్తంగా SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు EC సిద్ధమవుతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని AP, TG సహా 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. APR నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR పూర్తవగా, ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.

News February 19, 2026

విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

image

UP కాన్పూర్‌లో జరిగిన అండర్-13 మ్యాచులో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో అంపైర్ మాణిక్ గుప్తా (65) ప్రాణాలు కోల్పోయారు. ముఖం, శరీరం చుట్టూ పెద్దసంఖ్యలో తేనెటీగలు కుట్టడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో ఫీల్డ్ అంపైర్, 15-20 మంది ఆటగాళ్లు సైతం గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.