News August 24, 2025

రూ.70లక్షల అప్పుచేసి వ్యాపారి పరార్

image

గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్‌టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకుపైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News August 24, 2025

మక్తల్: గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

image

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలిక బొలెరో వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మక్తల్ మండల పరిధిలోని సంఘం బండ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామ సమీపంలో నివాసం ఉంటున్న కృష్ణవేణి(12) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఓ బొలెరో తనను ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News August 24, 2025

ఎన్టీఆర్ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ సెప్టెంబర్ 7న దుర్గమ్మ గుడి మూసివేత
☞ అనిగండ్లపాడులో క్షుద్ర పూజలు కలకలం
☞ వత్సవాయిలో మహిళ సూసైడ్
☞ నందిగామలో భారీ కొండచిలువ
☞ చందర్లపాడులో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
☞ నిడమానూరు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
☞ కంచికచర్లలో చేతికొచ్చిన మినప పంట.. తగ్గిన ధరలు

News August 24, 2025

రాత్రి కొబ్బరినూనె తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

image

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్‌, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.