News February 13, 2025

రూ.8వేలతో విశాఖ నుంచి కుంభమేళాకు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16న ద్వారకా బస్సు స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపబడునన్నారు. టికెట్ ధర రూ.8 వేలు. టికెట్స్ కావలసినవారు ఆన్‌లైన్ ద్వారా గాని, సమీప బస్ స్టేషన్లోగాని పొందవచ్చన్నారు.

Similar News

News February 27, 2026

45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

image

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

News February 27, 2026

విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ‌తో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 27, 2026

మాంసం వ్యర్థాల మాయాజాలం.. కాంట్రాక్టర్లకు జీవీఎంసీ చెక్

image

మాంసం వ్యర్థాల ద్వారా GVMCకు వచ్చే ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 10-15 టన్నులు, ఆదివారం 30 టన్నుల వరకు వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్టు నెల రోజుల సర్వేలో తేలింది. ఇవి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా గోదావరి జిల్లాల చేపల చెరువులకు మళ్లుతున్నట్లు గుర్తించారు. ఇకపై వీటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోనే టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.