News November 9, 2025
రూ.8వేల కోట్లతో మన్ననూరు- శ్రీశైలం కారిడార్

నల్లమల్ల అటవీ ప్రాంతం మండల పరిధిలోని మన్ననూరు నుంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు రూ.8 వేల కోట్లతో కారిడార్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నివేదికను రూపొందించింది. 52 కిలోమీటర్ల మీద నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ రోడ్ పనులు తుది దశకు చేరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దీంతో రిజర్వ్ ఫారెస్ట్‌లో పకృతి వనంలో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని ప్రయాణికులు భావిస్తున్నారు.
Similar News
News November 9, 2025
‘ఫిట్ ఇండియా’కు మద్దతుగా జిల్లాలో సైక్లోథాన్ 5కె ర్యాలీ

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ‘సైక్లోథాన్ 5కె సైకిల్ ర్యాలీ’ని ఉత్సాహంగా నిర్వహించారు. అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది.
News November 9, 2025
ప్రకాశం జిల్లాకు CM రాక.. కారణమిదే!

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు 11న రానున్నారు. పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పీసీపల్లి మండలం లింగన్నపాలెం సమీపంలో 20 ఎకరాల భూమిలో రూ. 7కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశారు. దీనిని నిర్మాణానికి గత నెల కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడంతో దీనిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News November 9, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్‌లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.


