News February 6, 2025
రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738771460791_71682618-normal-WIFI.webp)
జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 6, 2025
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738771823368_52218543-normal-WIFI.webp)
జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసుపై వారానికి ఒకసారి సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. పోలీసులు వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలన్నారు.
News February 5, 2025
సింహాద్రిపురంలో పులి పిల్లలు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738732961569_1271-normal-WIFI.webp)
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
News February 5, 2025
కడపలో మహానాడు స్థలాన్ని పరిశీలించిన మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738677843955_52218543-normal-WIFI.webp)
మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.