News December 21, 2025

రూ.800 కోట్లతో తిరుపతి బస్టాండ్ నిర్మాణం..?

image

తిరుపతి బస్టాండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. RTC, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో(PPP) ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. NHML, RTC సంయుక్తంగా ప్రతిపాదించిన మోడల్‌ను CMకు పంపగా కొన్ని మార్పులతో ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.600 నుంచి రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతిలో సోమవారం జరిగే సమావేశంలో ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు.

Similar News

News December 31, 2025

MBNR: ఉద్యోగ నియామకాలు.. ప్రత్యేక సమావేశం

image

మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇవాళ జర్మనీ భాష, ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 22-38 సంవత్సరాలు ఉండాలని, BSc నర్సింగ్, GNM అర్హత కలిగిన వారు అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 31, 2025

NLG: ఈ ఉద్యోగానికి సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువే జీతం

image

జర్మనీ దేశంలోని పేరొందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. 22 నుంచి 38 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, GNM, ఒకటి, రెండేళ్లు క్లినిక్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలి.

News December 31, 2025

మంచిర్యాల కలెక్టర్‌పై ఆరోపణలు

image

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జల పుష్కరాలలో జల సంచయ్ జన్ భాగిదారీ విభాగంలో జిల్లాకు జాతీయస్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతి వచ్చింది. ఈ విషయంపై పలువురు కలెక్టర్‌పై ఆరోపణలు చేశారు. నకిలీ ఫోటోలు అప్ లోడ్ చేయడం ద్వారా అవార్డు వచ్చిందని, అసలు పని జరగలేదని అంటున్నారు.