News February 28, 2025

రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి: హోం మంత్రి 

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో హోంశాఖకు రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి అని హోమ్ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ‘ఎక్స్’ వేదిగా హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖకు రూ.920 కోట్ల పెండింగ్ బకాయిల్లో ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లించామన్నారు. 

Similar News

News September 14, 2025

చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

image

గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.

News September 14, 2025

Gen-Z పాపులేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువంటే?

image

Gen-Z యువత(1997-2012 మధ్య పుట్టినవారు) తలచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం. మన దేశంలో Gen-Z పాపులేషన్ 27.1% ఉందని ‘India in Pixels’ రిపోర్ట్ తెలిపింది. అత్యధికంగా బిహార్‌లో 32.5%, ఆ తర్వాత J&Kలో 30.8%, ఝార్ఖండ్ 30.7%, UP 30%, రాజస్థాన్ 29.2%, నార్త్‌ఈస్ట్‌లో 29.2% యువత ఉన్నారంది. ఇక TGలో 24.8%, కర్ణాటక 24.1%, AP 23.5%, TN 22%, కేరళలో 21.8% Gen-Zలు ఉన్నట్లు పేర్కొంది.

News September 14, 2025

మొక్కలు నాటడంలో సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్

image

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్ సృష్టించారు. భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక ఉన్న మైదానంలో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి బలరాం పాల్గొని 370 మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు.