News December 4, 2025

రూ.97.52 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు

image

స్వదేశీ దర్శన్ పేరుతో రూ.97.52 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధికి పనులు మొదలయ్యాయని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో చెప్పారు. ఇందులో భాగంగా ఆదర్శనగర్ కాల్వలో హౌస్ బోట్ ప్రాజెక్ట్‌ను సూర్యలంక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. హరిత రిసార్ట్స్ వద్ద రూ.7.50 కోట్ల నిధులతో అధునాతన హంగులతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. స్విమ్మింగ్ పూల్, 10 కాటేజీల పనులు త్వర త్వరగా ముగించాలన్నారు.

Similar News

News December 4, 2025

జిల్లాలో 53 టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53 మంది అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లు నియామకం కోసం ఆదేశాలు జారీ చేశామని డీఈవో సలీం భాష గురువారం తెలిపారు. ఔత్సాహికులు శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీటిని సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. స్కూల్ అసిస్టెంట్‌కు రూ.12,500, SGT‌కి రూ.10 వేలు పారితోషకం చెల్లిస్తామన్నారు. జిల్లాలో 53 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తామన్నారు.

News December 4, 2025

తిరుపతి: సరికొత్త లుక్‌లో పవన్ కళ్యాణ్..!

image

చిత్తూరులో DDO ఆఫీస్ ఓపెనింగ్ నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. సరికొత్త లుక్‌లో ఆయన కనిపించారు. జవాన్ స్టైల్లో షార్ట్‌గా క్రాప్ చేయించారు. ఫుల్ హ్యాండ్స్ జుబ్బాలో స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నం చేశారు. గతంలో ఆయన ఆర్మీ ప్యాంట్, బ్లాక్ టీషర్టుతో తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే.

News December 4, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

image

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.