News February 7, 2025
రూ.99లతో విజయవాడ నుంచి హైదరాబాద్

విజయవాడ-హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాద్లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి తిరుగుతాయన్నారు. బస్సు సేవలు మొదలైన తర్వాత రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ ఛార్జీ ఉంటుందన్నారు. ఈ విధంగా నాలుగు వారాల పాటు ఉంటుందన్నారు.
Similar News
News November 17, 2025
20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న పట్నాలోని గాంధీ మైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ప్రకటించారు. అదే రోజు మంత్రుల ప్రమాణం ఉంటుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News November 17, 2025
నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


