News April 18, 2024
రెంజల్: నీటిలో మునిగి పదోతరగతి విద్యార్థి మృతి
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కందకుర్తి గోదావరి నదిలో బుధవారం స్నానానికి వెళ్లిన నవాజ్ (16) అనే పదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతి చెందినట్లు SI సాయన్న తెలిపారు. నవాజ్.. స్నేహితులతో కలిసి మొగులపురా శివారు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో గుంతల లోతు తెలియక, ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News January 11, 2025
NZB: ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తాం: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎస్, మంత్రులు హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్‌ల సదస్సులో పాల్గొన్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 26 తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని విజయవంతం చేసేలా పని చేస్తామన్నారు.
News January 10, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి:DMHO
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు ఓపీ సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి ఓపిని టార్గెట్‌కు అనుగుణంగా చూడాలని తెలిపారు.
News January 10, 2025
ఆర్మూర్: హత్య కేసు UPDATE.. ముగ్గురు కొట్టడంతోనే మృతి
ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాత్రి సమయంలో కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, బడే రవి లు డబ్బుల విషయంలో మృతుడు మైలారపు సోమేశ్@ సాయిలు (60) గొడవపడి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలిందని ఆర్మూర్ సీఐ తెలిపారు.