News April 13, 2025
రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 15, 2025
నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.
News April 15, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్‌గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 15, 2025
ఏలూరు: భార్యపై అనుమానంతో ఉరేసుకున్న భర్త

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి పోణంగికి చెందిన దాసరి లక్ష్మణరావు (40) సోమవారం ఉరేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి భార్య సులోచన మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో లక్ష్మణరావు ఉరేసుకొని మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు.