News October 26, 2025
రెంటచింతల: గొర్రెలపైకి దూసుకెళ్లిన లారీ

రెంటచింతల బైపాస్ వద్ద శనివారం ఒక సిమెంట్ లారీ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకురావడంతో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బైపాస్ మార్గంలో లారీ వేగంగా వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 28, 2025
లింబాద్రిగుట్ట: సంతానం కోసం గరుడ ముద్ద ప్రసాదం

భీమ్‌గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. సంతానం కోరుకునే భక్తులు గరుడముద్ద ప్రసాదం కోసం ఆ రోజున ఉపవాసంతో విచ్చేయాలని ఆయన సూచించారు. తిరిగి నవంబర్ 6న భక్తులు కొండపైకి చేరుకుని, నవంబర్ 7న పోలు దారం వేసుకోవాలని పేర్కొన్నారు.
News October 28, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. రేపే లాస్ట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. SHARE IT.
News October 28, 2025
లోకేశ్వరం: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలం మొహాలలో చోటుచేసుకుంది. లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండే గంగన్న (53) చేసిన అప్పులు తీర్చలేక ఇంటిముందు వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని SI వెల్లడించారు.


