News November 15, 2025
రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్‌దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్‌పూర్ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్‌పూర్‌లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
Similar News
News November 15, 2025
KMM: జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ: కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహం ‘సైలెంట్ కిల్లర్’ అని పేర్కొంటూ, రోజూ అరగంట నడక, వైట్ రైస్ తగ్గించడం, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. పిల్లల్లో షుగర్ పెరుగుతున్నందున ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 55,829 మంది షుగర్ రోగులకు మందులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
SAతో తొలి టెస్ట్.. భారత్‌కు మెరుగ్గా విన్నింగ్ ఛాన్స్!

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో SA 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో సఫారీలు ఉన్నారు. క్రీజులో బవుమా(29), బాష్(1) ఉన్నారు. రేపు మిగతా 3 వికెట్లను త్వరగా కూల్చేస్తే IND గెలుపు నల్లేరుపై నడకే.
* స్కోర్లు: SA.. 159/10, 93/7; భారత్ 189/10
News November 15, 2025
‘మా అమ్మ చనిపోయింది.. డబ్బుల్లేవని చెప్పినా దాడి చేశారు’

ఇటీవల మేడ్చల్ జిల్లాలో <<18258825>>హిజ్రాల<<>> దాడిలో గాయపడ్డ సదానందం కీలక విషయాలు వెల్లడించారు. ‘పాలు పొంగించేందుకు కొత్త ఇంటికి వచ్చాం. అది గృహప్రవేశం కాదు. హిజ్రాలు రూ.లక్ష డిమాండ్ చేశారు. తల్లి చనిపోయింది, డబ్బుల్లేవని చెప్పినా వినకుండా బూతులు తిట్టారు. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించారు. ఆ తర్వాత 15-20 మంది వచ్చి హంగామా చేస్తుంటే బెదిరించా. తిరిగి నాపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు’ అని తెలిపారు.


