News February 4, 2025
రెండు మండలాలతో అమీన్ పూర్ మండల పరిషత్
రాష్ట్రంలోని అతి చిన్న మండల పరిషత్‌గా అమీన్ పూర్ నిలిచింది. రెండు గ్రామపంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్ పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
Similar News
News February 4, 2025
కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 4, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు
సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఐదు రోజుల సీసీఎల్ మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సాధారణ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవి వర్తిస్తాయన్నారు. దీంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 4, 2025
‘తిల్లు ముల్లు’లా సూర్య, శాంసన్ తీరు: అశ్విన్
ENGతో T20 సిరీస్‌లో విఫలమైన సూర్య, శాంసన్ ఆట తీరుపై అశ్విన్ స్పందించారు. ‘తిల్లు ముల్లు అనే మూవీలో రజినీకాంత్ 2 పాత్రలు పోషిస్తారు. మీసంతో ఒకటి, లేకుండా మరో క్యారెక్టర్‌లో ఉంటారు. సంజూ, సూర్యలను చూస్తుంటే అలాగే ఉంది. 5మ్యాచ్‌లలో ఒకే రకమైన బాల్, షాట్‌కు ఔట్ అయ్యారు. సూర్య తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలి. మనసులో అనేక ఆలోచనలతో సంజూ ఉన్నారు. ఇలా ఉంటే బ్యాటింగ్ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.