News December 18, 2024
రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా నెల్లూరు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఆదేశించారు. తీర ప్రాంత, పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, బోట్లు, వలలు జాగ్రత్త పరచుకోవాలన్నారు.
Similar News
News January 8, 2025
నేడు నెల్లూరు జిల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ
నేడు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2025
రేపు నెల్లూరు జల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ
రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2025
కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టండి : కలెక్టర్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోడి పందాలు జరగకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.