News March 21, 2024
రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 23, 2025
కరీంనగర్: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. ‘ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర’, ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశాలపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ఈ లింకులో ఈనెల 28 వరకు అప్లోడ్ చేయాలన్నారు. ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు.
News October 23, 2025
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. DCC అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
News October 23, 2025
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.