News August 5, 2024
రెండేళ్ల నరకయాతన.. రూ.2 కోట్లు పెట్టినా బతకలేదు

రూ.200 కోసం మొదలైన గొడవతో యువకుడి ప్రాణం పోయింది. పోలీసుల ప్రకారం.. NLG జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 జులై 31న వివేక్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిల్ రూ.900 కాగా రూ.700 ఇవ్వడంతో గొడవైంది. వివేక్ 20 మంది స్నేహితులతో వెంకటేశ్‌పై దాడి చేశాడు. రూ.2కోట్ల మేర ఖర్చు చేసినా రెండేళ్లపాటు మంచాన పడ్డ వెంకటేశ్ ఆదివారం మృతిచెందాడు.
Similar News
News September 14, 2025
రేపు MGU 4వ స్నాతకోత్సవం

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు PHD పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 150 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ లభించాయి.
News September 14, 2025
NLG: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో అధికారుల సమీక్ష రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు రేపు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.
News September 13, 2025
నకిరేకల్: విద్యార్థినికి వేధింపులు.. టీచర్ సస్పెండ్..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై <<17696456>>లైంగిక వేధింపుల <<>>ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.